ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగి ఆక్సిజన్ తొలగించిన అంబులెన్స్ డ్రైవర్! అడిగింది ఇవ్వలేదని..

ABN, First Publish Date - 2020-07-26T20:54:42+05:30

అడిగినంత ఇవ్వలేదని ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ అభాగ్యుడిపై కాఠిన్యం ప్రదర్శించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: అడిగినంత ఇవ్వలేదని ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ అభాగ్యుడిపై కాఠిన్యం ప్రదర్శించాడు. వాహనంలో అతడికి కుమారుడికి అమర్చిన ఆక్సినజ్‌ను తొలగించాడు. ఈ దారుణం పశ్చిమ బెంగాల్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితుడికి తొమ్మిదేళ్లు, తొమ్మిది నెలల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. వారు అనారోగ్యం బారిన పడటంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ వారికి కరోనా సోకిందని తేలడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు సిద్దమయ్యాడు. ఓ అంబులెన్స్ డ్రైవర్‌ను సహాయం కోరాడు. అయితే కేవలం 6 కీలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లడానికి అతడు ఏకంగా రూ. 9200 డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు వేడుకున్నా కూడా డ్రైవర్ వినలేదు. అప్పటికే అంబులెన్స్‌లో ఉన్న పిల్లల ఆక్సిజన్‌ను తొలగించాడు. ఇద్దరు చిన్నారులతో పాటు వారి తల్లిని కూడా వాహనం నుంచి కిందకు దింపేశాడు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన బాధితుడు వెంటనే ప్రభుత్వాస్పత్రి డాక్టర్లకు సమాచారం అందించడంతో వారు డ్రైవర్‌కు నచ్చ చెప్పారు. దీంతో అతడు రూ. 2 వేలకు అంగీకరించాడు. కాగా.. తన పిల్లలను తరలించేందుకు డాక్టర్లు ఎంతో సహాయం చేశారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని బాధితుడు వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2020-07-26T20:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising