ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిక్షణ, ప్లేస్‌మెంట్‌ ఇప్పిస్తామంటూ మోసం

ABN, First Publish Date - 2020-09-13T12:58:51+05:30

విమానాశ్రయంలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్‌ కల్పిస్తామంటూ ఫీజులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఫార్చ్యూన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫార్చ్యూన్‌ఫ్లైయర్స్‌ ఏవియేషన్‌అకాడమీపై మలక్‌పేట ఠాణాలో కేసు నమోదు

హైదరాబాద్, చాదర్‌ఘాట్‌, (ఆంధ్రజ్యోతి): విమానాశ్రయంలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్‌ కల్పిస్తామంటూ ఫీజులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఫార్చ్యూన్‌ ఫ్లైయర్స్‌ ఏవియేషన్‌అకాడమీపై పలువురు విద్యార్థులు మలక్‌పేట ఠాణాలో శనివారం ఫిర్యాదు చేశారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు తెలిపిన ప్రకారం.. మలక్‌పేట సలీంనగర్‌లోని ఫార్చ్యూన్‌ ఫ్లైయర్స్‌ ఏవియేషన్‌ అకాడమీ వృత్తి శిక్షణలో భాగంగా డిప్లొమా ఇన్‌ఏవియేషన్‌, హాస్పిటాలిటీ, కస్టమర్‌ సర్వీసెస్‌, గ్రూమింగ్‌, గ్రౌండ్‌స్టా్‌పలో ఆరు నెలలపా టు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.80 వేలు ఫీజుగా వసూలు చేసింది. రెండు జతల యూనిఫాంతోపాటు బుక్‌ లు, మేకప్‌ కిట్‌, పూర్తిస్థాయి గైడెన్స్‌ ఇస్తామని చెప్పి నమ్మించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంగరు సాహితీ పేర్కొంది. కేవలం ఒక జత యూనిఫాం అందజేసి మిగతా వాటిని పట్టించుకోలేదన్నారు.

ఉద్యోగావకాశాలు కల్పించకపోగా ఎలాంటి ఇంటర్వ్యూలను కూడా నిర్వహించలేదన్నారు. అకాడమీకి గుర్తింపు లేదని, సర్టిఫికెట్‌ చెల్లకపోవడంతో జీఎంఆర్‌ సంస్థ ఉద్యోగాలు ఇవ్వడంలేదని బయటపడడంతో తాము మోసపోయినట్లుగా భావించి అకాడమీకి రాగా తాళం వేసి ఉందన్నారు. కనీసం ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో తనతోపాటు మరో 20 మంది విద్యార్థులం కలిసి మలక్‌పేట ఠాణాలో ఫిర్యా దు చేసినట్లు సాహితీ వివరించారు. మలక్‌పేట ఎస్‌ఐ శ్రీనివా్‌సరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-13T12:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising