ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!

ABN, First Publish Date - 2020-05-10T01:27:25+05:30

ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


అసలేం జరిగింది!?

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్‌ నివాసముంటున్నాడు. సలీమ్‌కు నలుగురు భార్యలు.. వారంతా విదేశాల్లో ఉంటారు. సలీమ్ కూడా విదేశాల్లోనే ఉండి అమ్మాయిల కోసం తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఉంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడటమే అతని పని.! తాజాగా.. 23 ఏళ్ల యువతిపై కన్నేసిన సలీం ఆర్థిక సహాయం పేరుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి మత్తు మందిచ్చి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాలిక పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది.


కేసు నమోదు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఆ యువతి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో యువతి ఇచ్చిన ఫిర్యాదుపై సలీమ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆర్థిక సహాయం చేస్తానంటూ పలువురు అమ్మాయిలపై సలీమ్ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సలీం బాధితులు చాలా మందే ఉంటారని సమాచారం. ఈ కేసును లోతుగా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-05-10T01:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising