ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో యువతిని బస్సునుంచి దించేసిన సిబ్బంది.. తల్లి చేతుల్లోనే ఆమె మృతి

ABN, First Publish Date - 2020-07-04T23:15:08+05:30

మనుషుల్లో మానవత్వాన్ని కరోనా చంపేస్తోంది. ఇప్పటికే అనేక సంఘటనలు దీనికి నిదర్శనంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మనుషుల్లో మానవత్వాన్ని కరోనా చంపేస్తోంది. ఇప్పటికే అనేక సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. కళ్లు తిరిగి పడిపోయిన ఓ యువతికి కరోనా సోకిందనే అనుమానంతో ప్రయాణికులందరూ కలిసి దించేశారు. ఈ క్రమంలో ఆ యువతి రోడ్డుపైనే మరణించింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  ఉత్తరప్రదేశ్‌ రోడ్డు రవాణా వ్యవస్థకు చెందిన బస్సులో ఓ యువతి ప్రయాణిస్తోంది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఉంది. అయితే ఎండవేడి కారణంగా ఆ యువతి స్పృహ తప్పింది. దీంతో బస్సులోని వారంతా ఆమెకు కరోనా సోకిందని భావించి బలవంతంగా దించేశారు. వెంటనే ఈ క్రమంలో ఆ యువతికి గుండెపోటు రావడంతో అక్కడే మరణించింది. యువతి శరీరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు పంపించారు. అయితే ఆమెది సాధారణ మరణమేనని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని కేసు కొట్టేశారు. అయితే యువతి కుటుంబం మాత్రం బస్సు సిబ్బంది తమతో సక్రమంగా వ్యవహరించలేదని, కనీసం వారు సహకరించి ఉంటే తమ బిడ్డను కాపాడుకునే వీలుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-04T23:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising