యెస్ బ్యాంకు కేసులో అనిల్ అంబానీకి సమన్లు
ABN, First Publish Date - 2020-03-17T03:30:23+05:30
యెస్ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు అందాయి.
ముంబై: యెస్ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు అందాయి. ఆయనతోపాటు జీ గ్రూపునకు చెందిన సుభాష్ చంద్ర, జెట్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ కూడా విచారణలో పాల్గొనాలంటూ ఈడీ సమన్లు జారీచేసింది. అలాగే ఇండియాబుల్స్‌కు చెందిన సమీర్ గెహ్లాట్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కపిల్ వాధవన్‌ను కూడా యెస్ బ్యాంకు కేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ ఆదేశించింది. వీరితోపాటు అవంత గ్రూపునకు చెందిన గౌతం థాపర్ కూడా ఈడీ సమన్లు పంపిన వారిలో ఉన్నారు. కాగా, ఈడీ విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుభాష్ చంద్ర పేర్కొన్నారు. అలాగే ఈ నెల 19న అంబానీ ఈ విచారణలో పాల్గొనాల్సి ఉంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం ప్రకటించారు.
Updated Date - 2020-03-17T03:30:23+05:30 IST