ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విప్రో లాభం రూ.2,390 కోట్లు

ABN, First Publish Date - 2020-07-15T05:30:00+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశీయ ఐటీ కంపెనీ విప్రో నికర లాభం రూ.2,390.40 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,387.60 కోట్ల లాభంతో పోలిస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశీయ ఐటీ కంపెనీ విప్రో నికర లాభం రూ.2,390.40 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,387.60 కోట్ల లాభంతో పోలిస్తే అతి స్వల్పంగా పెరిగింది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం లాభం 2.73 వృద్ధిని నమోదు చేసుకుంది. కాగా జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో విప్రో ఆదాయం రూ.15,571.40 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా రాబడి వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం పెరిగి రూ.14,913.10 కోట్లకు చేరుకుంది. కొత్త సీఈఓగా థియరీ డెలాపోర్ట్‌ నియమితులయ్యాక విప్రో ప్రకటించిన తొలి ఆర్థిక ఫలితాలివి.


సమీక్షా కాలానికి ఐటీ సేవల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.7 శాతం తగ్గి 192.16 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఐటీ సేవల నిర్వహణ మార్జిన్‌ 19 శాతంగా నమోదైంది. స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అయితే, మార్కెట్‌ వర్గాల్లో పెద్దగా అంచనాలు లేకపోవడంతో విప్రో షేరు 1.10 శాతం నష్టపోయి రూ.225.05 వద్ద ముగిసింది. 


రూ.170 కోట్లకు బ్రెజిల్‌ కంపెనీ కొనుగోలు 

బ్రెజిల్‌కు చెందిన ‘ఐవీఐఏ సర్వినోస్‌ డి ఇన్ఫర్మేటికా ఎల్డిటా’ కంపెనీని 2.24 కోట్ల డాలర్ల (రూ.169 కోట్లు)కు కొనుగోలు చేస్తున్నట్లు విప్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సెప్టెంబరు చివరినాటి కల్లా ఒప్పందం పూర్తికావచ్చని విప్రో భావిస్తోంది. 1996లో ఏర్పాటైన ఐవీఐఏ సంస్థ బ్రెజిల్‌లోని ఆర్థిక సేవలు, రవాణా, రిటైల్‌, హెల్త్‌కేర్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలకు ఐటీ సేవలందిస్తోంది. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌, మెక్సికో, చిలీ, కొలంబియా, కోస్టారికాల్లో విప్రో కార్యాలయాలు కలిగి ఉంది. ఈ మార్కెట్‌లో సేవలను మరింత పటిష్ఠపర్చుకునేందుకు ఈ డీల్‌ దోహదపడనుందని విప్రో పేర్కొంది. 


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising