పది బిలియన్ డాలర్ల ఆదాయం... 2027 నాటికి భారత్ నుంచి వాల్‌మార్ట్ లక్ష్యం
ABN, First Publish Date - 2020-12-12T00:06:22+05:30
ప్రపంచ ఉత్పాదక శక్తిగా మారిన నేపధ్యంలో భారత్ లో... ప్రముఖ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్... తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ప్రస్తుతమున్న వ్యాపారాన్ని మరో మూడు రెట్టు పెంచే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది.
గురుగావ్ : ప్రపంచ ఉత్పాదక శక్తిగా మారిన నేపధ్యంలో భారత్ లో... ప్రముఖ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్... తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ప్రస్తుతమున్న వ్యాపారాన్ని మరో మూడు రెట్టు పెంచే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది. ఇదే క్రమంలో... అమెరికా ఉత్పత్తులను 2027 నాటికి ఏటా పది బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలోనే... భారత్ లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు వాల్‌మార్ట్ నిర్ణయం మంచి ప్రోత్సాహాన్నిస్తోందని, అంతేకాకుండా నాణ్యత కలిగిన భారత్ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ కు అందించేందుకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కాగా... భారతదేశం తన టాప్ సోర్సింగ్ మార్కెట్లలో ఒకటిగా వాల్‌మార్ట్ పేర్కొనడం విశేషం. భారత్ లో ఎగుమతులు ఒక బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే... అమెరికాలో మార్కెట్ షేర్ కోసం పోటీపడుతోన్న వాల్‌మార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పుడు భారత్ లో కూడా వ్యాపార విస్తరణ కోసం పోటీ పడుతుండడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆన్‌లైన్ మార్కెట్ లో చోటుచేసుకోనున్న వృద్ధిని కైవసం చేసుకోవాలని ఈ సంస్థలు యత్నిస్తున్నాయి. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన, 500 బిలియన్ డాలర్ల వార్షికాదాయం కలిగిన అతిపెద్ద రిటెయిల్ కంపెనీ వాల్‌మార్ట్... ఇప్పుడు భారత్ లో కూడా వ్యాపార విస్తరణ పై దృష్టి పెట్టడం గమనార్హం.
Updated Date - 2020-12-12T00:06:22+05:30 IST