ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూజర్ల ఖాతా నుంచి అకారణంగా రూ. 99 కట్ చేసిన వొడాఫోన్

ABN, First Publish Date - 2020-06-02T23:51:16+05:30

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన వినియోగదారుల ఖాతాల నుంచి రెంటల్, ఇంటర్నేషనల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన వినియోగదారుల ఖాతాల నుంచి ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీల పేరుతో రూ.99 కట్ చేసింది. తమ ఖాతాల నుంచి ఒక్కసారిగా రూ. 99 కట్ కావడంతో షాకైన యూజర్లు వెంటనే ట్విట్టర్ ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉన్నా, తాను ఎటువంటి అంతర్జాతీయ రోమింగ్ ఎంచుకోకపోయినా రూ. 99 ఎందుకు కట్ చేశారంటూ ఓ ఖాతాదారుడు ప్రశ్నించాడు. ఒకరి తర్వాత ఒకరిగా బాధితులు ట్విట్టర్‌లో స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేశారు. 


‘‘ప్రియమైన ఖాతాదారులారా 30 రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్‌కు గాను రూ. 99 రెంటల్‌ను చార్జ్ చేస్తున్నాం’’ అంటూ తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లను పెద్ద ఎత్తున షేర్ చేయడంతో వొడాఫోన్ స్పందించింది. సాంకేతిక పరమైన పొరపాటు వల్ల అలా జరిగిందని వివరణ ఇచ్చింది. కట్ చేసిన మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పేర్కొంటూ క్షమాపణలు తెలిపింది. 

Updated Date - 2020-06-02T23:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising