ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వర్క్ ఫ్రమ్ హోం’ పై విప్రో కీలకాదేశాలు

ABN, First Publish Date - 2020-11-03T22:30:12+05:30

ఐటీ దిగ్గజం విప్రోలో వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికాల్లో పని చేస్తున్న ఉద్యోగులు జనవర 18 వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ఐటీ దిగ్గజం విప్రోలో వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికాల్లో పని చేస్తున్న ఉద్యోగులు జనవర 18 వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.


గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అవకాశాన్నిచ్చింది. విప్రో కూడా ఉద్యోగులకు ‘ఇంటి నుండి పని’ని పొడిగించింది. విప్రోలో 1.85 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇందులో ఎక్కువ మంది భారత దేశంలో పనిచేస్తుండగా, కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు.


కాగా... భారత్, అమెరికాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు వచ్చే ఏడాది వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులతో సహా సపోర్టింగ్, నాన్-బిల్లబుల్ ఉద్యోగులు కూడా సంబంధిత మేనేజర్లను సంప్రదించి ఇంటి నుండి పని చేయవచ్చునని టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ తెలిపింది. 

ఈ నిర్ణయం అందుకే ... అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి వివరాలను ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల పని అంశానికి సంబంధించి కూడా ఆయా దేశాల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు తొలి ప్రాధాన్యమని తెలిపింది. వర్క్ కల్చర్‌లో మార్పు కరోనా కారణంగా పనితీరు పూర్తిగా మారిపోయిందని, భవిష్యత్తులో ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని కొద్ది నెలల క్రితం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఐటీ ఉద్యోగులు ఇంటినుండే పని చేస్తున్నారు. అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. అన్-లాక్ నేపథ్యంలో ప్రస్తుతం 75 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇంటి నుండి పనిని పొడిగిస్తున్నాయి. 

Updated Date - 2020-11-03T22:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising