వెరా స్మార్ట్ రూ.140 కోట్ల పెట్టుబడులు
ABN, First Publish Date - 2020-11-13T08:26:11+05:30
హైదరాబాద్‌కు చెందిన వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ విస్తరణకు దాదాపు రూ.140 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కొత్తగా వీ-క్యూబ్ పేరుతో ఇంటి వద్దే టెస్టులు, డయగ్నాస్టిక్ సేవలు, వర్చువల్ డాక్టర్ కేర్, ఔషధాల డెలివరీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ విస్తరణకు దాదాపు రూ.140 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కొత్తగా వీ-క్యూబ్ పేరుతో ఇంటి వద్దే టెస్టులు, డయగ్నాస్టిక్ సేవలు, వర్చువల్ డాక్టర్ కేర్, ఔషధాల డెలివరీ వంటి 20 సేవలను కొత్తగా ప్రారంభించనుంది. కస్టమర్ల కోసం హై స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని 1,500 పడకల పొందినట్లు వెరా స్మార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ ధర్మ తేజా తెలిపారు. ఆదా యం తక్కువగా ఉండే వారికి వైద్య ఖర్చులను వాయిదాల పద్ధతిలో చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2020-11-13T08:26:11+05:30 IST