ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరు 30లోగా ఐటీఆర్‌లు వెరిఫై చేసుకోండి

ABN, First Publish Date - 2020-07-14T05:58:25+05:30

పన్ను చెల్లింపుదారులకు వన్‌ టైమ్‌ మినహాయింపును ఇస్తున్నట్లు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. గత ఐదు మదింపు సంవత్సరాల (2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20)కు సంబంధించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పన్ను చెల్లింపుదారులను కోరిన ఐటీ శాఖ 


న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు వన్‌ టైమ్‌ మినహాయింపును ఇస్తున్నట్లు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. గత ఐదు మదింపు సంవత్సరాల (2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20)కు సంబంధించి ఈ-ఫైలింగ్‌ రిటర్నులు దాఖలు చేసి వెరిఫికేషన్‌ పూర్తి కాని వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికల్లా పన్ను చెల్లింపుదారులు ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ కోరింది. బెంగళూరులోని సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)కు ఎలకా్ట్రనిక్‌ విధానంలో దాఖలు చేసిన ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు (ఐటీఆర్‌) చాలా పెండింగ్‌లో ఉండటంతో ఈ వన్‌టైమ్‌ మినహాయింపును ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సీపీసీ నుంచి చెల్లుబాటయ్యే ఐటీఆర్‌-ఠి (వెరిఫికేషన్‌) ఫామ్‌ రిసీట్‌ను పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారని ఆదాయ పన్ను శాఖ అభ్యర్ధించటంతో సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణీత కాలంలో ఐటీఆర్‌-ఠి ను దాఖలు చేసి వెరిఫికేషన్‌ పూర్తి కాకపోతే ‘నాన్‌ ఈఎ్‌సటీ’ లేదా పెండింగ్‌, నాన్‌ రిసీట్‌ ఫర్‌ ఐటీఆర్‌-ఠి గా పరిగణించే అవకాశం ఉండటంతో పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటును ఇచ్చింది. ఆధార్‌ ఆధారిత వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ-ఫైలింగ్‌కు లాగిన్‌ అయిన లేదా ఎలకా్ట్రనిక్‌ వెరిఫికేషన్‌ కోడ్‌ (ఈవీసీ) ద్వారా లేదా పోస్టు ద్వారా సంతకం చేసిన ఐటీఆర్‌ను బెంగళూరు సీపీసీకి పంపించి పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. సాధారణంగా 120 రోజుల్లో ఈ పన్ను రిటర్నుల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదురైన పక్షంలో ఆదాయ పన్ను శాఖ కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఇస్తోంది.


Updated Date - 2020-07-14T05:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising