ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెన్‌ టెక్నాలజీస్‌ వెంటిలేటర్‌ సిద్ధం

ABN, First Publish Date - 2020-05-19T06:07:34+05:30

హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. సిమ్యులేటర్ల తయారీలో ఎంతో నైపుణ్యం కలిగిన కంపెనీ కొవిడ్‌-19పై పోరాటానికి మద్దతుగా వెంటిలేటర్‌ను అభివృద్ధి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నెలన్నరలో అభివృద్ధి
  • ధ్రువీకరణ దిశగా అడుగులు
  • ఉత్పత్తికి కంపెనీలతో చర్చలు
  • ధర రూ.8-9 లక్షలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. సిమ్యులేటర్ల తయారీలో ఎంతో నైపుణ్యం కలిగిన కంపెనీ కొవిడ్‌-19పై పోరాటానికి మద్దతుగా వెంటిలేటర్‌ను అభివృద్ధి చేపట్టింది. దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి కంపెనీలతో చర్చిస్తున్నట్లు జెన్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అట్లూరి వెల్లడించారు. ఆ వివరాలు..


వెంటిలేటర్‌ తయారీ ఆలోచన ఎలా వచ్చింది? 

కరోనా నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీతో వెంటిలేటర్‌ను తయారు చేయాలని భావించాం. భారత్‌ కోసం ప్రోటోటైప్‌ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేయడానికి చిన్న పరిశోధన, అభివృద్ధి బృందాన్ని ఏర్పాటు చేశాం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీన్ని నెలన్నరలో అభివృ ద్ధి చేశాం. దీని ధ్రువీకరణకు ప్రయత్నాలు చేస్తున్నాం. 


ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ?

వాణిజ్యపరంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేం. అయితే దీన్ని పరిశీలించిన వారు సాఽధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని  వారు కోరుతున్నారు. ఉత్పత్తి చేపట్టడానికి 4-5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం.


ఎగుమతి ఆలోచన ఉందా?

దేశీయ మార్కెట్లోనే కాకుండా  ఎగుమతి చేయాలని కూడా భావిస్తున్నాం. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఎగుమతులకు చర్చలు జరుపుతున్నాం. కాగా మేం తయారు చేసింది హైఎండ్‌ వెంటిలేటర్‌. కంప్రెషర్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేశాం. దీని ధర రూ.8-9 లక్షల వరకు ఉంటుంది. 


Updated Date - 2020-05-19T06:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising