ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ ఐఫోన్ వచ్చిందట.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లబోదిబో!

ABN, First Publish Date - 2020-10-25T00:04:32+05:30

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తనను మోసం చేసిందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్య శర్మ ఆరోపించాడు. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ ‌సేల్‌లో తాను ‘ఐఫోన్ 11 ప్రొ’ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తనను మోసం చేసిందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్య శర్మ ఆరోపించాడు. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ ‌సేల్‌లో తాను ‘ఐఫోన్ 11 ప్రొ’ను ఆర్డర్ చేస్తే తనకు నకిలీది వచ్చిందని ఆరోపించాడు. ఈ మేరకు యూట్యూబ్ ద్వారా తాను అందుకున్న నకిలీ ఐఫోన్‌ను చూపించాడు. అయిది ఫేక్ ఐఫోన్ అని ఎలా చెప్పగలుగుతున్నదీ ఉదాహరణలతో సహా వివరించాడు. యూఎస్‌బీ కేబుల్, ఎయిర్ బబుల్స్, ఫోన్‌లోని యాప్‌లను బట్టి అది నకిలీ ఐఫోన్ అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నాడు.


యాపిల్ మ్యాప్స్‌కు బదులు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ కావడం అతడి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అందులోని యాప్స్ అన్నీ ఐఓఎస్ యాప్స్‌లానే కనిపిస్తున్నా ఆండ్రాయిడ్‌తో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. మామూలుగా అయితే తేడాను చెప్పడం సాధ్యం కాదు కాబట్టే ఈ వీడియోను తీసినట్టు భవ్యశర్మ పేర్కొన్నాడు.  


విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ టెక్నీషియన్ దృష్టికి తీసుకెళ్తే అతడు దానిని వెనక్కి తీసుకెళ్లేందుకు నిరాకరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఫోన్ అన్ని క్వాలిటీ చెక్ పాయింట్లు దాటిందని, దీనికి రిటర్న్ వ్యాలిడిటీ లేదని చెప్పాడని భవ్యశర్మ పేర్కొన్నాడు. 



Updated Date - 2020-10-25T00:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising