ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవ‘సాయ’మే ఆర్థిక వ్యవస్థకు అండ

ABN, First Publish Date - 2020-08-05T06:44:41+05:30

కొవిడ్‌తో ఆర్థిక వ్యవస్థకు పట్టిన కష్టాలు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత, నిబందనల సడలింపుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: కొవిడ్‌తో ఆర్థిక వ్యవస్థకు పట్టిన కష్టాలు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత, నిబందనల సడలింపుతో కొన్ని రంగాలు ఇప్పటికే గాడిలో పడుతున్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం వరుణుడు సకాలంలో కరుణించడంతో ఆర్థిక వ్యవస్థకు వ్యవ‘సాయ’మే పెద్ద అండ అని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ధిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాలు పేర్కొంది. కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలూ ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రభుత్వ గోధుమల కొనుగోళ్ల ద్వారా నే రైతులకు రూ.75,000 కోట్లు అందిన విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకుంటుందని అంచనా వేసింది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్లు దీనికి గండికొట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - 2020-08-05T06:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising