బీదర్-బెంగళూరు మధ్య ట్రూజెట్ సేవలు
ABN, First Publish Date - 2020-02-08T07:32:20+05:30
హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్ బీదర్-బెంగళూరుల మధ్య విమాన సేవలను ప్రారంభించింది. ఉడాన్ ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్ బీదర్-బెంగళూరుల మధ్య విమాన సేవలను ప్రారంభించింది. ఉడాన్ పథకం కింద సేవలు అందిస్తున్న పట్టణాల నెట్‌వర్క్‌లో తాజాగా బీదర్ చేరిందని టర్బో మేఘా ఎయిర్‌వేస్ డైరెక్టర్ కేఈ ప్రదీప్ తెలిపారు. విమానం బెంగళూరులో ఉదయం 11.25 గంటలకు బయలుదేరి బీదర్‌కు మధ్యాహ్నం 1.05 గంటలకు చేరుతుంది. బీదర్‌లో 1.35 గంటలకు బయలుదేరి బెంగళూరుకు సాయంత్రం 3.15 గంటలకు చేరుతుంది. స్ర్పింగ్ సీజన్‌ను పురస్కరించుకుని 4 రోజుల పాటు అన్ని గమ్యమస్థానాలకు బేసిక్ చార్జీని రూ.699గా నిర్ణయించింది.
Updated Date - 2020-02-08T07:32:20+05:30 IST