ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్ల కొనుగోళ్ళు సూపర్... మహీంద్రా 56 %, ఎస్కార్ట్ ఎగుమతులు 33 % అధికం

ABN, First Publish Date - 2020-12-02T01:24:20+05:30

నవంబరులో ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి. కరోనా నేపథ్యంలో అన్‌లాక్ తర్వాత వివిధ రంగాల్లో వృద్ధి రేటు మైనస్‌లలో లేదా తక్కువగా ననమోదైన విషయం తెలిసిందే. అయితే... వ్యవసాయ వృద్ధి మాత్రం ఆశాజనకంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : నవంబరులో ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి. కరోనా నేపథ్యంలో అన్‌లాక్ తర్వాత వివిధ రంగాల్లో వృద్ధి రేటు మైనస్‌లలో లేదా తక్కువగా ననమోదైన విషయం తెలిసిందే. అయితే... వ్యవసాయ వృద్ధి మాత్రం ఆశాజనకంగా ఉంది. ఫామ్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఎస్కార్ట్ అగ్రి మిషనరీ అమ్మకాలు పెరిగాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్లు 2019 నవంబరులో 7,642 యూనిట్లు విక్రయం కాగా, ఈ నవంబరులో 33 శాతం పెరిగి 10,165గా నమోదయ్యాయి. 


ఎస్కార్ట్, మహీంద్రా అమ్మకాలు...

2019 నవంబరులో ఎస్కార్ట్ ట్రాక్టర్ల అమ్మకాలు డొమెస్టిక్ 7,379, ఎగుమతులు 263 కాగా, ఈ ఏడాది నవంబరులో డొమెస్టిక్ 9,662 యూనిట్లు, ఎగుమతులు 503 కు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాు 56 శాతం పెరిగాయి. గతేడాది నవంబరులో మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు  21,031 కాగా, ఈ నవంబరులో ఏకంగా 32,726 కు పెరిగాయి. డొమెస్టిక్ అమ్మకాలు గతేడాది 20,414 కాగా, ఈ నవంబరులో 31,619కి పెరిగాయి. ఎగుమతులు 1,107 యూనిట్లుగా నమోదయ్యాయి.


అశోక్ లేలాండ్ అమ్మకాలు... 

అశోక్ లేలాండ్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగాయి. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 14 శాతం పెరిగాయి. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ గతేడాది నవంబరులో 5,966 యూనిట్లు కాగా, ఈ నవంబరులో 5,114 కు పడిపోయాయి. అంటే... 14 శాతం క్షీణించాయి. లైట్ కమర్షియల్ వెహికిల్ అమ్మకాలు 4,209 యూనిట్ల నుండి 32 శాతం పెరిగి 5,545 యూనిట్లకు పెరిగాయి. మొత్తంగా అమ్మకాలు 10,175(2019) నుండి 5 శాతం పెరిగి 10,659 కు పెరిగాయి.


మహీంద్రా...

మహీంద్రా అండ్ మహీంద్రా పాసింజర్ వెహికిల్ అమ్మకాలు 2019 నవంబరులో 14,637 కాగా, 24 శాతం పెరిగి 18,212 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ అమ్మకాలు 42 శాతం తగ్గి 6,593 నుండి 3,854 యూనిట్లకు క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగుమతులు 2019 లో 2,621 యూనిట్లు కాగా, 38 శాతం తగ్గి ఈ ఏడాది నవంబరులో 1,636 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫామ్ ఎక్విప్‌మెంట్స్ గతేడాది 21,031 యూనిట్లు కాగా, 56 శాతం పెరిగి 32,,726 యూనిట్లకు చేరుకున్నాయి.

Updated Date - 2020-12-02T01:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising