ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ మాయం

ABN, First Publish Date - 2020-07-10T02:29:45+05:30

ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడిది అందుబాటులో లేకుండా పోయింది. కొత్త జాతీయ చట్టాన్ని చైనా ఆమోదించిన కొన్ని రోజులకే ఈ యాప్‌‌ మాయం కావడం గమనార్హం. ఆన్‌లైన్ కంటెంట్‌పై ఈ చట్టం పోలీసులకు సర్వాధికారాలు ఇస్తుంది. దీంతో ఈ చట్టంపై ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, చైనా ప్రభుత్వంతో టిక్‌టాక్‌కు ఉన్న సంబంధాల కారణంగా అమెరికా దానిపై ఓ కన్నేసి ఉంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో హాంకాంగ్ నుంచి ఈ యాప్‌ను ఉపసంహరించుకుంటామని చైనా తెలిపింది. 


షార్ట్ వీడియో సర్వీస్ అయిన టిక్‌టాక్ అమెరికా నుంచి ఇండియా వరకు సెన్సేషన్ అయింది. చైనాలో మాత్రం ‘డౌయిన్’ పేరుతో అందుబాటులో ఉంది. 7.4 మిలియన్ ప్రజలున్న హాంకాంగ్‌లో సెప్టెంబరు నాటికే టిక్‌టాక్ 1.8 డౌన్‌లోడ్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు హాంకాంగ్‌లో ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో లేకపోవడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ దీనికి ప్రత్యామ్నాయంగా ‘డౌయిన్’ను ప్రవేశపెడుతుందా? అన్న విషయం తెలియరాలేదు.

Updated Date - 2020-07-10T02:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising