ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతీ బంపరాఫర్... కారు కొనకుండానే.. నెలకు రూ. 15 వేలు..

ABN, First Publish Date - 2020-10-21T01:47:44+05:30

దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి... వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను మరో రెండు నగరాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరుల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్, పుణే నగరాలకు కూడా విస్తరించింది. ఈ స్కీంలో భాగంగా... కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. నిర్వహణ ఛార్జీల కింద ప్రతీ నెల కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీం అమలు కోసం ‘జపాన్ ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్(ఇండియా)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి... వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను మరో రెండు నగరాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరుల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్, పుణే నగరాలకు కూడా విస్తరించింది. ఈ స్కీంలో భాగంగా... కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. నిర్వహణ ఛార్జీల కింద ప్రతీ నెల  కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీం అమలు కోసం ‘జపాన్ ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్(ఇండియా)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 


రూ. 11 వేలకు పైగా బెనిఫిట్... ప్రభుత్వోఉద్యోగులకు మారుతీ సుజుకి ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.  హైదరాబాద్ సహా నాలుగు నగరాలకు మారుతీ సుజుకి సబ్‌స్క్రిప్షన్ స్కీం మూడు నెలల క్రితం ప్రారంభమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో తొలుత ప్రారంభమైంది. ఇప్పుడు మరో రెండు నగరాలకు విస్తరించడం ద్వారా మొత్తం నాలుగునగరాలకు విస్తరించినట్లైంది. కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేయకుండానే నెలవారీ ఎక్స్‌క్లూజివ్ ఫీజును చెల్లించి ఉపయోగించుకోవచ్చు. నెలవారీ కొంతమొత్తం చెల్లిస్తే మిగతా విషయాలను కంపెనీయే చూసుకుంటుంది.


ప్రతీ నెల కొంత మొత్తం చెల్లిస్తే చాలు... కారు నిర్వహణ, బీమా, రోడ్ సైడ్ అసిస్ట్ వంటివి కంపెనీయే చూసుకుంటుంది. వీటితో కలిపి నెలవారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6 తదితర మోడళ్ళపై ఈ స్కీం అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇక... రానున్న రెండు, మూడేళ్లలో 40 నుండి 60 పట్టణాల్లో దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మారుతి సన్నాహాలు చేస్తోంది. కాగా కారును ముందుగానే కస్టమర్ పేరుపై రిజిస్టర్ చేస్తారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సురెన్స్ కలిపి ఛార్జీ వసూలు చేస్తారు. 

Updated Date - 2020-10-21T01:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising