భారత్‌లోనే తయారీ... ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 7,777 మాత్రమే...
ABN, First Publish Date - 2020-08-06T19:09:43+05:30
స్మార్ట్ ఫోన్ల తయారీ విషయంలో భారత్ వేగాన్ని పెంచింది. భారత్ కు చెందిన లావా కంపెనీ... తక్కువ ధరతో కూడుకున్న మొబైల్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు... ‘లావా జెడ్66’ మోడల్. గురువారం నుంచి ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ ధర... కేవలం రూ. 7,777 మాత్రమే.
న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ల తయారీ విషయంలో భారత్ వేగాన్ని పెంచింది. భారత్ కు చెందిన లావా కంపెనీ... తక్కువ ధరతో కూడుకున్న మొబైల్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు... ‘లావా జెడ్66’ మోడల్. గురువారం నుంచి ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ ధర... కేవలం రూ. 7,777 మాత్రమే.
కాగా... డ్యూయెల్ 4జీ సపోర్ట్, 3,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.08 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ తదితర అంశాలు ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇక... 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరాలో బ్యూటీ మోడ్, నైట్ మోడ్, హెచ్డీఆర్ మోడ్, బర్స్ట్ మోడ్, పనోరమా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ వంటి ఫీచర్స్ ఉండడం విశేషం.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫారంలతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలలో కూడా లావా జెడ్66 స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 7,777 మాత్రమే. డ్యూయెల్ 4జీ సపోర్ట్, 3,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.08 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
ఇక... 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరాలో బ్యూటీ మోడ్, నైట్ మోడ్, హెచ్డీఆర్ మోడ్, బర్స్ట్ మోడ్, పనోరమా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలలో కూడా లావా జెడ్66 స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. రూ.8 వేల లోపు బడ్జెట్లో బేసిక్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం ఈ ఫోన్ తీసుకొచ్చింది లావా కంపెనీ.
పూర్తిగా భారత్‌లోనే తయారైన స్మార్ట్‌ఫోన్ ఇది. కాగా ఓపెనింగ్ అమ్మకాలు సంతృప్తికరంగా ఉన్నట్లు కంపెనీ ఎగ్జ్సిక్యూటివ్లు చెబుతున్నారు.
Updated Date - 2020-08-06T19:09:43+05:30 IST