ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 5 నుంచి ఏఐప్రైవేటీకరణ రెండో దశ

ABN, First Publish Date - 2020-12-30T06:44:48+05:30

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణ ప్రక్రియ రెండో దశ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణ ప్రక్రియ రెండో దశ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది. తొలి దశలో ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లు ఆహ్వానించగా.. టాటా సన్స్‌, ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగ బృందం సహా పలువురు ప్రాథమిక బిడ్లు సమర్పించాయి. ఇందులో అర్హులను ప్రకటించడం ద్వారా రెండో దశ ప్రారంభమవుతుంది. ప్రాథమిక బిడ్డింగ్‌లో అర్హత సాధించినవారు రెండో దశలో ఫైనాన్షియల్‌ బిడ్లు సమర్పించాల్సి ఉంటుం ది.


వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగం గా  ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాతోపాటు చౌక విమానయాన సేవల విభాగమైన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రె్‌సలోనూ 100 శాతం వాటా విక్రయించనుంది. అలాగే, ‘ఎయిర్‌ ఇండియా శాట్స్‌’ (ఏఐఎ్‌సఏటీఎ్‌స)లో ఎయిర్‌ ఇండియాకున్న 50 శాతం వాటాను సైతం అమ్మకానికి పెట్టింది. ఈ బిడ్డింగ్‌లో విజేతకు యాజమాన్య హక్కులను సైతం బదిలీ చేయనున్నారు.


Updated Date - 2020-12-30T06:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising