ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఆటోమేటిక్ గేర్ కార్ల ధర... కేవలం రూ. 5 లక్షలే...

ABN, First Publish Date - 2020-11-16T01:10:43+05:30

ఆటోమేటిక్ గేరు కారు కొనాలనుకుంటే... కొన్ని చౌకైన కార్ల మోడళ్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కేవలం రూ. 5 లక్షల లోపు ఉన్న మంచి మోడల్స్ ఇవే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఆటోమేటిక్ గేరు కారు కొనాలనుకుంటే... కొన్ని చౌకైన కార్ల మోడళ్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కేవలం రూ. 5 లక్షల లోపు ఉన్న మంచి మోడల్స్ ఇవే...


మార్కెట్‌లో ప్రస్తుతం ఆటోమేటిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. యువతలో ఎక్కువ మంది ఆటోమేటిక్ గేర్ టెక్నాలజీతో కూడుకున్న కార్లను కొనుగోలు చేస్తున్నారు. నిజానికి కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక లగ్జరీగా భావించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడంతో... ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తోంది. ఈ కారణంగా ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ తారస్థాయిలో పెరిగింది. ప్రత్యేకించి భారతదేశ ట్రాఫిక్ దృష్ట్యా, కార్ల ప్రియులు ఈ తరహా ఆటోమేటిక్ కార్లను కొనేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆటోమేటిక్ కారు కొనాలనుకుంటే, కొన్ని చవకైన కార్ల మోడళ్ల గురించి తెలుసుకోవాలి. కేవలం రూ. 5 లక్షల లోపు ఉన్న మంచి మోడల్స్ ఇవే...

మారుతి సుజుకి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. మారుతి తన పోర్ట్‌ఫోలియోలో ఆల్టో కారులో పెట్రోల్, సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్లను కలిగి ఉంది. ఇది అత్యంత చవకైన ఆటోమేటిక్ కారు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 3 లక్షలు. మారుతి నుండి వచ్చిన ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా లభిస్తోంది. ఆల్టో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ ధర రూ. 4.43 లక్షలు. ఈ కారులో 998 సిసి ఇంజన్ ఉంది. ఇది 68 పిఎస్ శక్తితో 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.


ఇక భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల సంస్థ హ్యుందాయ్ ఆటోమేటిక్ కార్ మోడళ్లను కూడా తయారు చేస్తోంది. హ్యుందాయ్  ఆటోమేటిక్ వెర్షన్‌లో అత్యధిక ధర వద్ద ఉన్న కారు శాంత్రో. శాంత్రో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ల ధర రూ. 5.26 లక్షలు. ఈ కారులో 1.1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ శక్తివంతమైన ఇంజన్ 69 పీఎస్ శక్తితో 101 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 


మారుతి పోర్ట్‌ఫోలియోలోని మరో ఆటోమేటిక్ మోడల్ పేరు సిలేరియో. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ ధర రూ. 5.13 లక్షలు. ఈ కారులో 998 సీసీ 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది, ఇది 68 పీఎస్ శక్తితో 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెలెరియో యొక్క ఈ మోడల్ 21.63 కిమీ వరకు మైలేజీని ఇవ్వగలదు. 


ఇక జాబితాలో మరో కారు రెనాల్ట్ క్విడ్. దీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ల ధర రూ. 4.44 లక్షలు. ఈ కారులో 999 సీసీ ట్రిపుల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. రెనాల్ట్ క్విడ్ ఇంజన్ గరిష్టంగా 67 బీహెచ్‌పీ శక్తితో 91 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కారు ఈజీ-ఆర్ ఏఏఎంటీ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపిక కూడా ఇందులో ఉంటుంది. 

Updated Date - 2020-11-16T01:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising