ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యంత విలువైన భారత బ్రాండ్‌ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌

ABN, First Publish Date - 2020-09-19T05:52:32+05:30

ఈ ఏడాదికి గాను ‘బ్రాండ్జ్‌ అత్యంత విలువైన 75 భారత బ్రాండ్ల జాబితా’ విడుదలైంది. ప్రపంచంలో అతిపెద్ద అడ్వర్టైజింగ్‌ కంపెనీ డబ్ల్యూపీపీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానం 

30 స్థానాలు ఎగబాకిన రిలయన్స్‌ రిటైల్‌ 

టాప్‌-75 ఇండియన్‌ బ్రాండ్స్‌ లిస్ట్‌ విడుదల 


ముంబై: ఈ ఏడాదికి గాను ‘బ్రాండ్జ్‌ అత్యంత విలువైన 75 భారత బ్రాండ్ల జాబితా’ విడుదలైంది. ప్రపంచంలో అతిపెద్ద అడ్వర్టైజింగ్‌ కంపెనీ డబ్ల్యూపీపీ, డేటా విశ్లేషణ సేవల సంస్థ కాంటార్‌ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. 2020కి గాను దేశంలో అత్యంత విలువైన కార్పొరేట్‌ బ్రాండ్‌గా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ నిలిచింది. వరుసగా ఏడో ఏడాదీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజ బ్రాండ్‌ విలువ 2,026 కోట్ల డాలర్లుగా నమోదైంది.

గత ఏడాదితో పోలిస్తే మాత్రం విలువ 11 శాతం తగ్గింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. దీని బ్రాండ్‌ విలువ 1,829 కోట్ల డాలర్లు. టీసీఎస్‌ మూడో స్థానంలో ఉంది. 


టాప్‌-75 బ్రాండ్ల విలువ 6% డౌన్‌  

కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాది టాప్‌-75 ఇండియన్‌ కార్పొరేట్‌ బ్రాండ్ల విలువ 6 శాతం తగ్గి 21,600 కోట్ల డాలర్లకు పడిపోయింది. బ్యాంకింగ్‌, ఆటో రంగ కంపెనీల విలువలో మందగమనం జాబితాలోని మొత్తం బ్రాండ్ల విలువపై ప్రభావం చూపింది. వచ్చే ఏడాది బ్రాండ్లకు గడ్డుకాలమేనని డబ్ల్యూపీపీ పేర్కొంది. ప్రపంచంతో పోలిస్తే భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే, ఈ ఏడాది ప్రపంచ టాప్‌-100 బ్రాండ్ల విలువ 5.8 శాతం వృద్ధి చెందింది. 


టాప్‌-10 జాబితా 


2020        బ్రాండ్‌ బ్రాండ్‌ విలువ విలువ వృద్ధి 

ర్యాంక్‌ (కోట్ల డాలర్లు) (శాతం)

  1 హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 2,026 -11

  2 ఎల్‌ఐసీ 1,829 -9

  3 టీసీఎస్‌ 1,458 -20

  4 ఎయిర్‌టెల్‌ 1,394 36

  5 ఏషియన్‌ పెయింట్స్‌ 797 14

  6 కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 721 -6

  7 రిలయన్స్‌ జియో 687 26

  8 ఫ్లిప్‌కార్ట్‌ 652 40

  9 పేటీఎం 627 50

  10 ఎస్‌బీఐ 538 -36 


Updated Date - 2020-09-19T05:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising