ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెఎల్‌ఆర్‌ డ్రైవర్‌ రహిత విద్యుత్‌ కారు

ABN, First Publish Date - 2020-02-20T06:29:56+05:30

టాటా మోటార్స్‌కు చెం దిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) డ్రైవర్‌ రహిత విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ వద్దనున్న తన నూతన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవెంట్రీ (యూకే): టాటా మోటార్స్‌కు చెం దిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) డ్రైవర్‌ రహిత విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ వద్దనున్న తన నూతన ఇన్నోవేషన్‌ సెంటర్‌లో దీన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. దీన్ని ప్రాజెక్టు వెక్టార్‌గా కంపెనీ చెబుతోంది. ఇది అడ్వాన్స్‌డ్‌, ఫ్లెక్సిబుల్‌, మల్టీ యూజ్‌ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ అని పేర్కొంది. సమాజాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణాన్ని పరిశుద్ధంగా ఉంచే ఇన్నోవేషన్లలో జేఎల్‌ఆర్‌ లీడర్‌గా ఉంటుందని మరోసారి ప్రాజెక్ట్‌ వెక్టార్‌ నిరూపించిందని కంపెనీ సీఈఓ రాల్ఫ్‌ స్పెత్‌ తెలిపారు. కాగా 15 కోట్ల పౌండ్లతో ఏర్పాటు చేసిన జెఎల్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రిన్స్‌ చార్లెస్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఇది యూర్‌పలో అతిపెద్ద ఆటోమోటివ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌. ఈ నేషనల్‌ ఆటోమోటివ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో యూకే, భారత్‌ నుంచి 1,000 వరకు విద్యావేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, డిజైనర్లు భవిష్యత్‌ కార్లు, వాహనాలపై పని చేయనున్నారు. 

Updated Date - 2020-02-20T06:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising