ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ రుణసమీకరణ లక్ష్యం రూ.4.34 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2020-10-01T06:14:36+05:30

వర్తమాన ఆర్థిక సంవత్స రం ద్వితీయార్ధంలో రూ.4.34 లక్షల కోట్ల మేరకు రుణాలు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్స రం ద్వితీయార్ధంలో రూ.4.34 లక్షల కోట్ల మేరకు రుణాలు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కరోనాతో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి అవసరమైన నిధుల కోసం ఈ లక్ష్యం నిర్దేశించుకున్న ట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఏడాది మొత్తం మీద రూ.12 లక్ష ల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కట్టుబడాలని నిర్ణయించినట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. సెప్టెంబరు నెలతో ముగిసిన ప్రథమార్ధ భాగంలో రూ.6.98 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా అది రూ.7.66 లక్షల కోట్లకు చేరింది.


లక్ష్యం కన్నా పైనే విత్తలోటు: ప్రభుత్వాదాయాల్లో  కొరత కారణంగా ఆగస్టులో వరుసగా రెండో నెల కూడా విత్తలోటు పెరిగింది. ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్య కాలంలో విత్తలోటు వార్షిక లక్ష్యంలో 109.3 శాతం ఉంది. గత ఏడాది మొత్తం మీద విత్తలోటు ఏడు సంవత్సరాల గరిష్ఠ స్థాయి 4.6 శాతంగా నమోదయింది. కాగా కరెంట్‌ ఖాతా మిగులు జూన్‌ త్రైమాసికంలో జీడీపీలో 3.9 శాతానికి పెరిగి 1980 కోట్ల డాలర్లకు (రూ.1.49 లక్షల కోట్లు) చేరింది.

Updated Date - 2020-10-01T06:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising