ఆదుకోకుంటే..మూతే
ABN, First Publish Date - 2020-04-25T06:51:27+05:30
తెలంగాణలోని ఉక్కు పరిశ్రమలు ఆర్థిక భారంతో కుంగిపోతున్నాయి. ప్రభు త్వం ఆదుకోకపోతే మూసివేతే శరణ్యమని పరిశ్రమ ప్రతినిధులు ఆవేదన
ప్రభుత్వానికి తెలంగాణ ఉక్కు పరిశ్రమ వేడుకోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణలోని ఉక్కు పరిశ్రమలు ఆర్థిక భారంతో కుంగిపోతున్నాయి. ప్రభు త్వం ఆదుకోకపోతే మూసివేతే శరణ్యమని పరిశ్రమ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం రుణాలపై వడ్డీ చెల్లింపులు, స్థిర విద్యుత్ బిల్లులు, వేతనాల చెల్లింపులతో తెలంగాణ ఉక్కు పరిశ్రమలు సతమతమవుతున్నాయని అఖిల భారత ఇండక్షన్ ఫర్నేసెస్ అసోసియేషన్ దక్షిణ మధ్య ప్రాంత చాప్టర్ వెల్లడించింది. ఉక్కు పరిశ్రమ ల్లో అధిక పెట్టుబడి, శ్రామికులు అవసరమవుతారని, లాక్‌డౌన్ కష్టాల నుంచి పరిశ్రమ బయటపడి సజావుగా ఉత్పత్తి చేయాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని పేర్కొంది.
Updated Date - 2020-04-25T06:51:27+05:30 IST