ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను ఎగవేతదారులు తగ్గుతారు

ABN, First Publish Date - 2020-09-12T06:20:33+05:30

ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌లో కొన్ని ప్రారంభ ఇబ్బందులు ఉన్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్నాలజీ, అనలిటిక్స్‌తో సాధ్యం

‘ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌’తో మేలే

ఆదాయపు పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ జేబీ మహాపాత్ర


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌లో కొన్ని ప్రారంభ ఇబ్బందులు ఉన్నా.. పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారులకు, ఇతర భాగస్వాములందరికీ ఇది ప్రయోజనకరరగా ఉందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదాయ పన్ను (ఐటీ) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ జేబీ మహాపాత్ర అన్నారు. కొన్ని కీలక విషయాల్లో వ్యక్తిగతంగా కలవలేకపోవడం ఇబ్బందికరంగా ఉన్నా  వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా దాన్ని అధిగమించవచ్చని చెప్పారు. ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌ విధానంలో చెల్లింపుదారులకు, అసెసింగ్‌ అధికారికి సంబంధం ఉండదు. దీనివల్ల వేధింపులు ఉండవు. ఎలక్ర్టానిక్‌ పద్ధతిలో రిటర్న్‌లను పరిశీలిస్తారు. మదింపు ఒక్కరి చేతిలో ఉండదు. అందువల్ల పక్షపాత రహిత ఆర్డర్లు జారీ చేయొచ్చని వివరించారు. ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌ వల్ల పన్ను వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని, పారదర్శకత సైతం పెరుగుతుందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, బ్యాండ్‌విడ్త్‌ వంటి సాంకేతికపరమైన ఇబ్బందులను కూడా అధిగమించనున్నట్లు చెప్పారు.  


పన్ను రేట్లు తగ్గుతున్నాయ్‌

పన్ను రేట్లు తగ్గుతున్నందున భవిష్యత్తులో నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లింపులు పెరుగుతాయని మహాపాత్ర అన్నారు. అయితే ప్రభుత్వానికి ఆదాయం కావాల్సి ఉన్నందున మరింత పన్ను రేట్లు తగ్గింపును ఆశించలేమని చెప్పారు.  పన్నుల విధింపు, చెల్లింపులో పారదర్శకతపై ఫిక్కీ తెలంగాణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పన్ను చెల్లింపుదారుడినీ నిజాయితీపరుడుగానే పన్ను విభాగాలు భావిస్తాయని, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వంటి టెక్నాలజీలతో  ఎగవేతదారుల క్రమేపీ తగ్గిపోతారని మహాపాత్ర అన్నారు. ట్యాక్స్‌ పేయర్‌ చార్టర్‌ను ఒక ఉన్నత విధానంలో అమలు చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. 


హైదరాబాద్‌ భేష్‌: మల్లికా ఆర్యా

చిన్న వ్యాపారులు జీఎస్‌టీ చట్టంపై అవగాహన లేకనే తప్పులు చేస్తున్నారని, చట్టంపై అవగాహన తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని  జీఎ్‌సటీ అండ్‌ కస్టమ్స్‌, హైదరాబాద్‌  చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్యా తెలిపారు. పన్ను చెల్లింపుదారులను భాగస్వాములుగా భావిస్తున్నామని, పన్ను చెల్లింపుదారులు ఇంకా జీఎ్‌సటీపై అవగాహన పెంచుకునే దశలోనే ఉన్నారని ఆమె అన్నారు. వీలైనంత వరకూ పారదర్శకతను తీసుకురావడానికి పన్ను అధికారులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిబంధనలను పాటిస్తూ.. జీఎ్‌సటీ చెల్లిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారని, హైదరాబాద్‌ పరిధిలో జీఎస్‌టీ ట్యాక్స్‌ కాంప్లియన్స్‌ రేటు బాగుందని చెప్పారు. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత, వేధింపులు తగ్గడానికి వాణిజ్య మండళ్లు, పన్ను అధికారులు పరస్పరం సహకరించుకోవాలని, సమస్యలు, ఇతర అంశాలను పంచుకోవాలని మహాపాత్ర, మల్లికా ఆర్యా తెలిపారు. 

Updated Date - 2020-09-12T06:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising