ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత హడావుడి మంచిది కాదు

ABN, First Publish Date - 2020-12-10T06:48:54+05:30

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వస్తుందా లేదా అన్న సందిగ్ధం నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంత కంటే ఎక్కువ సందిగ్ధంలో ఉన్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై వరప్రసాద్‌ రెడ్డి జూ వంటిల్లే పెద్ద ఔషధశాల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజనెస్‌): కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వస్తుందా లేదా అన్న సందిగ్ధం నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంత కంటే ఎక్కువ సందిగ్ధంలో ఉన్నాం. ఏ వ్యాక్సిన్‌ మంచిది. దేన్ని నమ్మొచ్చు? వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎంత కాలం పని చేస్తుంది. మళ్లీ ఎప్పుడు తీసుకోవాలి. ఎంత కాలం  నిల్వ ఉంటుంది? వ్యాక్సిన్‌ వస్తే ముందు ఎవరికి ఇస్తారు వంటి అనేక సందేహాలు అందరినీ తొలిచి వేస్తున్నాయని  శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ కేఐ వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. టై గ్లోబల్‌ సదస్సులో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ‘హౌవ్‌ సూన్‌ ఈజ్‌ సూన్‌? ఈజ్‌ దేర్‌ యాన్‌ ఆల్టర్నేటివ్‌’ అనే అంశంపై మాట్లాడారు. 


 300 కోట్ల డోసులు కావాలి..

వ్యాక్సిన్‌ ఒక్క డోసుతో సరిపోదని.. రెండు డోసులు ఇవ్వాలని వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. దేశంలోని 130 కోట్ల మంది జనాభాకు 260 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరమవుతుంది. కోల్డ్‌ చెయిన్‌, రవాణా, నిల్వ వంటి సౌకర్యాలు మారుమూల ప్రాంతాల్లో అంత సులభం కాదు. 15 శాతం వరకూ చెడిపోవడం సర్వసాధారణం. అంటే భారత్‌లో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే 300 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరమవుతుంది.

దేశంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, తదితర కంపెనీలు ఏడాది కాలంలో 300 కోట్ల డోసులను అందించగలవా అన్నది జవాబు లేని ప్రశ్న. వ్యాక్సిన్‌ నిల్వ ఉండే స్వభావం లేక పోతే భారీ ఎత్తున ఒకే సారి తయారీ చేయడానికి సాధ్యం కాదు. నిరంతరం తయారు చేస్తూనే ఉండాలని వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. 


గతానికి భిన్నంగా..

ఏ వ్యాక్సిన్‌ మంచిదనేది తెలుసుకోవడానికి గతంలో కంపెనీలు తమ క్లినికల్‌  డేటాను ప్రముఖ సైంటిఫిక్‌ పత్రికల్లో ప్రకటించేవి.  భద్రత, పనితీరు అన్నీ తెలిసేవి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పరిస్థితి వేరు. డేటాను సైంటిఫిక్‌ పత్రికల్లో ప్రకటించడం లేదు. డేటాను నేరుగా రెగ్యులేటరీ అథారిటీకి సమర్పిస్తున్నాయి. 


వచ్చే ఏడాది మధ్య నాటికి..

వచ్చే ఏడాది మధ్య నాటికి బహుశా ఏప్రిల్‌ నాటికి దేశంలో మొదటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వీలుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి రావచ్చు. ననోఫీ, శాంతా బయోటెక్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది చివరకు రానుంది. 


వంట గదే ప్రత్యామ్నాయం..

మన సంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం. మన వంట గదే పెద్ద ఔషధాల ఖని. మన సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలను అనుసరిస్తే.. మనకు వ్యాక్సినే అవసరం ఉండదని నా అభిప్రాయం. నేను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదు. 


ఒత్తిడి తేవడం సరైన విధానం కాదు..

వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి. కంపెనీలు కూడా ముందుగా తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి.. ఇది సరైన పద్దతి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో భద్రతకు తిలోదకాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ప్రతి వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ అప్రమత్తంగా ఉండాలి. 


Updated Date - 2020-12-10T06:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising