ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుసగా ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్.. 1,115 పాయింట్ల పతనం

ABN, First Publish Date - 2020-09-24T22:08:36+05:30

ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఏ దశలోనూ పుంజుకోలేక నష్టాల్లోనే ముగిసింది. నేడు బెంచ్ మార్క్ సూచీలు 2.5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఏ దశలోనూ పుంజుకోలేక నష్టాల్లోనే ముగిసింది. నేడు బెంచ్ మార్క్ సూచీలు 2.5 శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా గత ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,600 (దాదాపు 6.5 శాతం) పాయింట్లను కోల్పోయింది.


ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడడంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37 వేల పాయింట్ల మార్కును కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 326 పాయింట్లు పతనమై 10,806కు చేరుకుంది. ఆగస్టు 4 తర్వాత నిఫ్టీ 11 వేల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. 


నేటి ట్రేడింగ్‌లో ఈక్విటీ పెట్టుబడిదారులు రూ. 3.36 లక్షల కోట్లు నష్టపోగా, గత ఆరు రోజుల సెషన్స్‌లో మొత్తంగా రూ. 10.73 లక్షల కోట్లు ఆవిరైంది. మార్కెట్లు వాస్తవికత పొందుతున్నాయని, అదే ఈ దిద్దుబాటుకు దారితీస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలు నష్టపోయాయి. మెటల్‌, మీడియా, ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో, ఫార్మా, రియల్టీ 4-3 శాతం మధ్య క్షీణించాయి. ఇక, నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్ 3 శాతం, జీ 1 శాతం, హెచ్‌యూఎల్‌ 0.25 శాతం మాత్రమే లాభపడ్డాయి.  


Updated Date - 2020-09-24T22:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising