‘స్పుత్నిక్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్!
ABN, First Publish Date - 2020-10-03T07:10:45+05:30
‘స్పుత్నిక్’ టీకా (వ్యాక్సిన్) మూడో దశ (ఫేజ్-3) క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దరఖాస్తు చేసింది...
డీసీజీఐ అనుమతి కోసం డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు
న్యూఢిల్లీ: ‘స్పుత్నిక్’ టీకా (వ్యాక్సిన్) మూడో దశ (ఫేజ్-3) క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దరఖాస్తు చేసింది. డీసీజీఐ అను మతిస్తే భారత్‌లో మనుషులపై పరీక్షలు పూర్తి చేసి వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టాలని డాక్టర్ రెడ్డీస్ భావిస్తోంది. కొవిడ్ నియంత్రణ కోసం రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఆ దేశంలో 40 వేల మందిపై పరీక్షిస్తున్నారు. కాగా అన్ని సాంకేతికాంశాలను పరిశీలించాక డీసీజీఐ ఫేజ్-3 ట్రయల్స్‌కు అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated Date - 2020-10-03T07:10:45+05:30 IST