ఫైనాన్సియల్ స్టాక్‌ల జోరు... లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..
ABN, First Publish Date - 2020-10-01T22:08:16+05:30
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ మరోసారి భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు బలపడగా...
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ మరోసారి భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు బలపడగా... నిఫ్టీ సైతం మరోసారి 11,400 మార్కునకు ఎగువన నమోదైంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఫైనాన్సియల్ స్టాక్‌లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 629.12 పాయింట్లు (1.65 శాతం) ఎగబాకి 38,697.05 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 169.40 పాయింట్లు (1.51 శాతం) బలపడి 11,416.95 వద్ద క్లోజ్ అయ్యింది. ఇండస్‌ఇండ్ బ్యాంకు 12 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలవగా... తర్వాత స్థానాల్లో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైన్ సర్వ్, కొటాక్ బ్యాంకు తదితర షేర్లు ఉన్నాయి. మరోవైపు ఐటీసీ, ఎన్టీపీసీ, టైటాన్, ఆర్ఐఎల్, ఓఎన్జీజీ తదితర స్టాక్‌లు వెనుకబడ్డాయి.
Updated Date - 2020-10-01T22:08:16+05:30 IST