20 శాతం తగ్గిన సౌదీ అరామ్కో లాభం
ABN, First Publish Date - 2020-03-16T06:54:45+05:30
సౌదీ అరామ్కో నికర లాభం 2019 సంవత్సరంలో 20.6 శాతం తగ్గింది. ముడిచమురు ధరలు తక్కువ స్థాయిలో ఉండటం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని...
రియాద్: సౌదీ అరామ్కో నికర లాభం 2019 సంవత్సరంలో 20.6 శాతం తగ్గింది. ముడిచమురు ధరలు తక్కువ స్థాయిలో ఉండటం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. గత డిసెంబరులో సౌదీ అరామ్కో తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. ఇష్యూ తర్వాత మొదటిసారిగా కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2018లో కంపెనీ నికర లాభం 11,110 కోట్ల డాలర్లు ఉండగా.. 2019 నాటికి 8,820 కోట్ల డాలర్లకు తగ్గిపోయింది. ముడి చమురు ధరల్లో క్షీణత, ఉత్పత్తిలో తగ్గుదల, రిఫైనింగ్, కెమికల్ మార్జిన్లలో క్షీణత వంటివి లాభాలు తగ్గడానికి కారణమైనట్టు వివరించింది. 2019 సంవత్సరానికి 7,320 కోట్ల డాలర్ల డివిడెండ్లను పంపిణీ చేయనున్నట్టు పేర్కొం ది. ఈ ఏడాది నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి కనీసం 7,500 కోట్ల డాలర్ల డివిడెండ్లను అందించనున్నట్టు తెలిపింది. 2018లో కంపెనీ మూలధన వ్యయం 3,510 కోట్ల డాలర్లు ఉండగా.. 2019 సంవత్సరంలో 3,280 కోట్ల డాలర్లకు తగ్గింది.
Updated Date - 2020-03-16T06:54:45+05:30 IST