ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్లనూ ఆదుకోరూ..

ABN, First Publish Date - 2020-03-27T05:55:15+05:30

పేదలకు ప్రకటించిన తర హాలోనే కార్పొరేట్‌ రంగానికి ప్ర భుత్వం ప్యాకేజీ ఇవ్వాలని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పేదలకు ప్రకటించిన తర హాలోనే కార్పొరేట్‌ రంగానికి ప్ర భుత్వం ప్యాకేజీ ఇవ్వాలని ఫిక్కీ ప్రెసిడెంట్‌  సంగీతా రెడ్డి కోరారు.  ఆర్థిక మంత్రి నుంచి మరిన్ని చర్యలతో కూడిన ప్రకటనల కోసం మేం ఎదురు చూస్తున్నాం. కార్పొరేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆమె అన్నారు. కోవిడ్‌ ప్రభావం వల్ల పలు రంగాలు చిధ్రమయ్యాయని, ఈ పరిస్థితిలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలను ఆదుకోవడం కూడా చాలా అవసరమని సంగీతా రెడ్డి సూచించారు.

 పేదల కోసం ప్రభుత్వం తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రెసిడెంట్‌ కరుణేంద్ర జాస్తి తెలిపారు. కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రాణనష్టాన్ని తగ్గించగలవని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన రిలీఫ్‌ ప్యాకేజీ పేదలకు ఎంతో ఊరట ఇస్తుందని సీఐఐ, తెలంగాణ చైర్మన్‌ కృష్ణ బోదనపు తెలిపారు. 

Updated Date - 2020-03-27T05:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising