ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానయాన రంగానికి రూ.27,000 కోట్ల నష్టం

ABN, First Publish Date - 2020-03-26T08:16:47+05:30

కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విమాన సర్వీసులను జూన్‌ చివరి వరకు నిలిపివేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్వీసుల నిలిపివేత కొనసాగితే అంతే.. కాపా ఇండియా అంచనా 

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విమాన సర్వీసులను జూన్‌ చివరి వరకు నిలిపివేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో భారత విమానయాన రంగానికి 330-360 కోట్ల డాలర్ల (సుమారు రూ.25,000-27,000 కోట్లు) నష్టం రావొచ్చని ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సెంటర్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌ ఏవియేషన్‌ (కాపా) ఇండియా అంచనా వేస్తోంది. ఏప్రిల్‌ 15 వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విమానయాన రంగంపై తీవ్రమైన ప్రభావం పడనుంది.


కాపా ఇండియా అంచనా ప్రకా రం.. విమానయాన కంపెనీలు 175 కోట్ల డాలర్ల నష్టాన్ని, విమానాశ్రయాలు, కన్సెషనరీస్‌ 150-175 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించవచ్చని పేర్కొంది. గ్రౌండ్‌ హ్యాండర్లు 8-9 కోట్ల డాలర్ల నష్టాలను చవిచూడవచ్చని తెలిపింది. ఇవన్నీ కలిపి విమానయాన రంగ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో 330-360 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని కాపా అంచనా వేస్తోంది. జూన్‌ 30 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తే ఈ స్థాయిలో నష్టాలు ఉంటాయని లెక్కలు వేశారు. కాగా, ఎయిర్‌ ఇండియాకు రోజుకు రూ.30-35 కోట్ల నష్టం రావొచ్చని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - 2020-03-26T08:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising