ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా ట్రస్ట్‌లకు ఊరట…

ABN, First Publish Date - 2020-12-29T22:51:46+05:30

మూడు టాటా ట్రస్ట్‌లకు భారీ ఊరట లభించింది. ఆదాయం పన్నుశాఖలోని 11 సెక్షన్‌ కింద ట్రస్టులకు ఇచ్చిన పన్ను మినహాయింపులకు సంబంధించిన విషయంలో ఎటువంటి అభ్యంతరానికి ఆస్కారం లేదంటూ ఇన్‌కం టాక్స్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముంబై : మూడు టాటా ట్రస్ట్‌లకు భారీ ఊరట లభించింది. ఆదాయం పన్నుశాఖలోని 11 సెక్షన్‌ కింద ట్రస్టులకు ఇచ్చిన పన్ను మినహాయింపులకు సంబంధించిన విషయంలో ఎటువంటి అభ్యంతరానికి ఆస్కారం లేదంటూ ఇన్‌కం టాక్స్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) ఆమోదం తెలిపింది.


మూడు టాటా ట్రస్టులకు భారీ ఊరట లభించింది.  ఆదాయ పన్నుశాఖలోని 11 సెక్షన్‌ కింద ఇచ్చిన పన్ను మినహాయింపులకు సంబంధించిన విషయంలో ఎటువంటి అభ్యంతరానికి ఆస్కారం లేదని ఇన్‌కం టాక్స్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) ఆమోదం తెలిపింది. కాగా... మూడు టాటా ట్రస్టులు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌‌లను తిరిగి అంచనా వేస్తామని ఆదాయం పన్నుశాఖ జారీ చేసిన ఆదేశాలను ఐటీఏటీ కొట్టేసింది.


ఐటీఏటీ చీఫ్‌ జస్టిస్‌ పీపీ భట్‌, ఉపాధ్యక్షుడు ప్రమోద్‌ కుమార్‌లతో కూడిన బెంచ్‌... టాటా ట్రస్టులపై సైరస్‌ మిస్త్రీ దాఖలు చేసిన పత్రాలపై అనుమానం వ్యక్తం చేసింది. కాగా...  2016 అక్టోబర్‌ 24 న టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌ అధినేతగా ఉద్వాసనకు గురైన కొన్ని వారాల్లోనే ఆదాయం పన్నుశాఖకు ఆయన పలు పత్రాలు పంపారు. టాటా గ్రూప్‌ ట్రస్టులకు ఇచ్చిన ఆదాయం పన్ను మినహాయింపులను తొలగించాలని సైరస్‌ మిస్త్రీ అభ్యర్థించారు. 


సైరస్‌ మిస్త్రీ సమర్పించిన పత్రాలు సంబంధిత సంస్థ అధికారికంగా ధ్రువీకరించిన పత్రాలు కావని ఐటీఏటీ అభిప్రాయపడింది.

Updated Date - 2020-12-29T22:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising