‘రిలయన్స్ టు బిల్ గేట్స్ కంపెనీ’... భారీ పెట్టుబడుల ప్రవాహం
ABN, First Publish Date - 2020-11-14T00:31:50+05:30
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రారంభించిన సంస్థలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) భారీ పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ మార్పులపై పోరాటంలో భాగంగా బిల్ గేట్స్... ‘బ్రేక్‌థ్రూ ఎనర్జీ వెంచర్స్(బీఈవీ)’ కంపెనీలో రిలయన్స్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఈ మేరకు బీఈవీతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది.
ముంబై : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రారంభించిన సంస్థలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) భారీ పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ మార్పులపై పోరాటంలో భాగంగా బిల్ గేట్స్... ‘బ్రేక్‌థ్రూ ఎనర్జీ వెంచర్స్(బీఈవీ)’ కంపెనీలో రిలయన్స్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఈ మేరకు బీఈవీతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. పెట్టుబడుల బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించినట్లు పేర్కొంది.
రానున్న 8-10 సంవత్సరాల కాలంలో విడతలవారీగా ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ సాంకేతికత, బ్రేక్ థ్రూ ఎనర్జీ ద్వారా స్వచ్ఛమైన, ఉద్గారరహిత విద్యుత్తు శక్తిని కనుగొనేందుకు ఈ బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్‌ను ప్రారంభించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 5.75 శాతం వాటాను దక్కించుకుంటుంది. బిల్ గేట్స్ బ్రేక్ థ్రూ సంస్థను 2015లో ప్రారంభించారు. ప్రపంచాన్ని నెట్ జీరో ఉద్గారాలకు తీసుకు వెళ్లే లక్ష్యంతో దీనిని మొదలు పెట్టారు.
Updated Date - 2020-11-14T00:31:50+05:30 IST