ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 భారత మార్కెట్లోకి ‘రియల్‌మి సి15’

ABN, First Publish Date - 2020-08-16T02:00:30+05:30

రియల్‌మి నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మి సి15’ విడుదలకు సిద్ధమైంది. ఇండోనేషియాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రియల్‌మి నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మి సి15’ విడుదలకు సిద్ధమైంది. ఇండోనేషియాలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్ ఈ నెల 18న మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనున్న వర్చువల్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయనుంది. అదే కార్యక్రమంలో ‘రియల్‌మి సి12’ను కూడా లాంచ్ చేయనుంది. రియల్‌మి సి15  3జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో ఇంచుమించు రూ. 10,100 ఉండే అవకాశం ఉంది. 4జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ.11,100. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4జీబీ+128 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ. 12,700.  


రియల్‌మి సి15 స్పెసిఫికేషన్లు: 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W క్విక్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి35 మొబైల్ ప్లాట్‌ఫాం, ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు, వెనకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. 


రియల్‌మి సి11 సక్సెసర్‌గా వస్తున్న రియల్‌మి సి12 2జీబీ+32 జీబీ స్టోరేజీ సింగిల్ వేరియంట్‌లో వస్తోంది. దీని ధర భారత్‌లో రూ.7,499గా ఉండే అవకాశం ఉంది. 


Updated Date - 2020-08-16T02:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising