ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాలకు, ఎగుమతిదారులకు ఊరట

ABN, First Publish Date - 2020-04-02T05:44:19+05:30

కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఒకటేమో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్‌బీఐ తాజా నిర్ణయం


ముంబై: కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఒకటేమో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల కోసం  కాగా.. మరో రెండు చర్యలేమో ఎగుమతిదారులు, బ్యాంకుల కోసం. ఆ వివరాలు..  


వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సె్‌స (డబ్ల్యూఎంఏ)లో భాగంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే రుణాల పరిమితిని 30 శాతం పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నెల 1 నుంచే అమలులోకి వచ్చిన పరిమితి పెంపు.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (సెప్టెంబరు 30) వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ద్రవ్య కొరతను తీర్చుకునేందుకు ఈ నిధి నుంచి గరిష్ఠంగా 90 రోజుల కోసం రుణం తీసుకునే వీలుంటుంది.


వస్తువులు లేదా సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులపై రాబడిని స్వదేశానికి తరలించేందుకు మరింత సమయం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎగుమతి రాబడిని ఎగుమతి తేదీ నుంచి 9 నెలల్లోగా స్వదేశానికి తరలించాలి. ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతులకు ఈ గడువును 15 నెలలకు పెంచింది.

 

బ్యాంకులు కౌంటర్‌సైకిల్‌ క్యాపిటల్‌ బఫర్స్‌ (సీసీవైబీ)ని మరో ఏడాది వరకు అమలులోకి తీసుకురానవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది. అంటే, ఈ బఫర్‌ కోసం కేటాయించాల్సిన నిధులను బ్యాంకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. 

Updated Date - 2020-04-02T05:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising