ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌వీబీపై రంగంలోకి ఆర్‌బీఐ

ABN, First Publish Date - 2020-09-29T06:23:26+05:30

అప్పుల కుప్పలా మారిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. తాత్కాలికంగా బ్యాంకు రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ (సీఓడీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నిర్వహణ కోసం డైరెక్టర్ల కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ : అప్పుల కుప్పలా మారిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. తాత్కాలికంగా బ్యాంకు రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ (సీఓడీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ఎండీ, సీఈఓకు ఉండే విచక్షణాధికారాలు ఉంటాయని తెలిపింది. శుక్రవారం జరిగిన ఏజీఎంలో ఎండీ, సీఈఓ, ఆరుగురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు, ఆడిటర్ల నియామక తీర్మానాన్ని బ్యాంక్‌ వాటాదారులు తిరస్కరించిన సంగ తి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. మీటా మకాన్‌, శక్తి సిన్హా, సతీష్‌ కుమార్‌ కల్రాలతో కూడిన ఈ కమిటీకి మీటా మకాన్‌ నాయకత్వం వహిస్తారు. 


డిపాజిట్లపై భయం వద్దు

ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన వెంటనే ఈ కమిటీ రంగంలోకి దిగింది. డిపాజిట్ల భద్రతపై డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. చెల్లింపుల కోసం ఆర్‌బీఐ పేర్కొన్న కనీస నిల్వల నిబంధనల కంటే 162 శాతం అఽధిక నిధులు ఉన్నట్టు తెలిపింది. ఖాతాదారులతో పాటు, రుణదాతలు, బ్యాంకు రుణ పత్రాల్లో మదుపు చేసిన మదుపరుల చెల్లింపులకూ ఎలాంటి ఢోకా ఉండదని డైరెక్టర్ల కమిటీ పేర్కొంది. ఆర్‌బీఐ చర్యలతో బీఎ్‌సఈలో ఎల్‌వీబీ షేరు లాభాల బాట పట్టింది. ఆరంభంలో 5.72 శాతం నష్టపోయిన ఈ షేరు చివరికి 5.21 శాతం లాభంతో రూ.20.20 వద్ద ముగిసింది. 


Updated Date - 2020-09-29T06:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising