ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీఐ... వడ్డీరేట్లు యధాతథం..!

ABN, First Publish Date - 2020-11-30T20:40:40+05:30

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీరేట్లను ఈ దఫా కూడా యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్భణం 7 శాతానికి పైగా నమోదైన విషయం తెలిసిందే. సెప్టెంబరులోననూ ఏడు శాతం కంటే పెరిగింది. ఇక కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో... ఆర్‌బీఐ వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చుని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా చపేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీరేట్లను ఈ దఫా కూడా యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్భణం 7 శాతానికి పైగా నమోదైన విషయం తెలిసిందే. సెప్టెంబరులోననూ ఏడు శాతం కంటే పెరిగింది. ఇక కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో... ఆర్‌బీఐ వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చుని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా చపేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి నాల్గవ తేదీ వరకు ఆర్‌బీఐ పరపతి సమీక్ష ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ద్రవ్యోల్భణం లక్ష్యం 4 శాతం కాగా, వరుసగా రెండో నెల కూడా 7 శాతంగా నమోదైంది.

రిటైల్ ద్రవ్యోల్భణం ఎఫెక్ట్...
సరఫరా వ్యవస్థలో ఎదురవుతోన్న సమస్యల కారణంగా ధరల సూచీ వరుసగా రెండో నెల 7 శాతానికి పైగా నమోదు చేసిందని, ఈ క్రమంలో... ఆర్‌బీఐ... కీలక వడ్డీరేట్లను తగ్గించకపోచ్చని ఖారా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో... ఆర్‌బీఐ ద్రవ్య విధాంలో రెపోరేటు విషయంలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్భణం గరిష్టస్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని కూడా అభిప్రాయపడుతున్నారు.

వరుసగా మూడోసారి...
అక్టోబరు ఎంపీసీ సమావేశంలో సర్దుబాటు ధోరణిని కొనసాగిస్తూ రెపోరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించింది. ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించినపక్షంలో... వరుసగా మూడోసారి కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నట్లవుతుంది. 

Updated Date - 2020-11-30T20:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising