ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

ABN, First Publish Date - 2020-08-06T18:34:26+05:30

కీలక వడ్డీ రేట్లను యధాతథంగానే ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లను ఈసారి యథాతథంగానే ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే య‌ధాత‌థంగా ఉంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అనీ.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు. రెపోరేటు తగ్గితే.. తద్వారా వచ్చే లబ్ధిని తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఆశిస్తాయి. తద్వారా గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ భారం తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి.


కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), నాబార్డ్‌ల (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ద్వారా అదనంగా మరో రూ.10 వేల కోట్ల మేర నగదు లభ్యతను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలు ఇప్పటికీ మందకొడిగానే కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్టు కనిపించినా ఇటీవల ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో మళ్లీ మందగమనం తప్పడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. కరోనా కల్లోలం, తదనంతర లాక్‌డౌన్ కారణంగా కుంటుపడిన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. 

Updated Date - 2020-08-06T18:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising