ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకులకు నిధులపై నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2020-10-20T05:42:05+05:30

బ్యాంకులకు అదనపు మూ లధనం కల్పించడాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రుణ మారటోరియం, వడ్డీ మాఫీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అన్నారు. ప్రస్తుతం భారతీయ బ్యాంకులపై 12 వేల కోట్ల డాలర్ల (రూ.9 లక్షల కోట్లు)....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బ్యాంకులకు అదనపు మూ లధనం కల్పించడాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రుణ మారటోరియం, వడ్డీ మాఫీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అన్నారు. ప్రస్తుతం భారతీయ బ్యాంకులపై 12 వేల కోట్ల డాలర్ల (రూ.9 లక్షల కోట్లు) భారీ మొండి బకాయిల భారం ఉందని, వచ్చే మార్చి నాటికి అవి రెట్టింపయ్యే ఆస్కారం ఉన్నదని చెప్పారు. అర్ధవంతమైన రికవరీ రావాలంటే బ్యాంకులకు అదనపు మూలధనం అత్యంత కీలకమని, కాని దీనిపై అవసరమైనంతగా దృష్టి సారిండంలేదని వ్యాఖ్యానించారు.


ఈ వైఖరి వాటిని రోడ్డుకీడ్చినట్టవుతుందని, స్వల్పకాలిక లాభాల కోసం ఆర్థిక స్థిరత్వాన్ని ఫణం గా పెట్టిన చందంగా మారుతుందని ఆచార్య స్పష్టం చేశారు. పదే పదే ఇలాంటి తప్పు చేయడం వల్ల ప్రతికూల పరిణామాల నుంచి భారత్‌ కోలుకోకుండా నిరోధించినట్టవుతుందని హెచ్చరించారు. మారటోరియం, వ్యవసాయ రుణాలకు క్షమాభిక్ష వంటి చర్యలు స్వల్పకాలంలో రుణగ్రహీతలకు అ వసరానికి మించి చేయూత ఇచ్చినట్టవుతుందని, ఈ వైఖరితో రు ణాల వృద్ధిలో రికవరీని నిలువరించినట్టేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-20T05:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising