కరోనా ఎఫెక్ట్: కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ?
ABN, First Publish Date - 2020-03-16T21:24:37+05:30
కరోనా కలకలంతో ప్రపంచ ఆర్థికవృద్ధి మందగించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులన్నీ ఒక్కోటిగా రేట్ల కోతకు దిగుతున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా కలకలంతో ప్రపంచ ఆర్థికవృద్ధి మందగించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులన్నీ ఒక్కోటిగా రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో రేట్ల కోత విధిస్తూ యూఎస్ ఫెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ స్థాయిలో రేట్ల కోత జరగడం అమెరికా చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. యూఎస్ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ కూడా రేట్ల కోతలు విధిస్తూ ప్రకటనలు చేశాయి. ఇదిలా వుండగా జపాన్ కూడా ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనుగోళ్లను రెండింతలు చేసింది. అలాగే కార్పోరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్ల కొనుగోళ్లకు తెరలేపింది. దీంతో జపాన్ కూడా రేట్ల కోత వైపే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా రేట్ల కోత అనివార్యమని, దీనిపై ఆర్బీఐ ఓ నిర్ణయానికి వస్తుందని ఆర్థికశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇలా రేట్లకోతపై చర్చలు నడుస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం 4గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో మాట్లాడుతారని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ కూడా రేట్ల కోత విధించనుందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Updated Date - 2020-03-16T21:24:37+05:30 IST