ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాణా కపూర్‌ లండన్‌ ఫ్లాట్‌ జప్తు

ABN, First Publish Date - 2020-09-26T06:42:12+05:30

యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆస్తి విలువ రూ.127 కోట్లు 


న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రాణా కపూర్‌పై మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఈ స్థిరాస్తిని జప్తు చేశారు. రాణా కపూర్‌ ఈ ఫ్లాట్‌ను 2017లో 99 లక్షల పౌండ్ల (రూ.93 కోట్లు)కు కొనుగోలు చేశారు. డీఓఐటీ క్రియేషన్స్‌ జెర్సీ లిమిటెడ్‌ అనే సంస్థ పేరిట కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీకి అసలు లబ్ధిదారు తనేనని ఈడీ పేర్కొంది. కపూర్‌ ఈ ఆస్తిని విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇందుకోసం ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను సైతం నియమించుకున్నట్లు ఈడీ వెల్లడించింది. 


కపూర్‌పై సెబీ కోటి జరిమానా: యెస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ రాణా కపూర్‌పై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ రూ. కోటి జరిమానా విధించింది. గతంలో మోర్గాన్‌ క్రెడిట్‌ నిధుల సేకరణ కు సంబంధించిన వివరాలను స్టాక్‌ మార్కెట్లకు వెల్లడించనందుకు గాను ఈ పెనాల్టీ విధించింది. 

Updated Date - 2020-09-26T06:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising