ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాజేషన్ నంబియార్...

ABN, First Publish Date - 2020-10-28T20:22:52+05:30

కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజేష్ నంబియార్‌ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమితులు కానున్నట్లు సమాచారం. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కాగ్నిజెంట్ ఇండియా  చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజేష్ నంబియార్‌ నియమితులయ్యారు.  ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమితులు కానున్నట్లు సమాచారం. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. 


ప్రస్తుతం ఆయన నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సియేనా ఇండియా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్ లో కంపెనీ కార్యకలాపాలను, ప్రభుత్వం, వినియోగదారులతో సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలోనే రాజేష్ ఎంపిక జరిగిందని భావిస్తున్నారు. సంస్థ సీఈవో బ్రియాన్ హాంప్‌షైర్స్ ఈ మేరకు  అభిప్రాయపడ్డారు. 


కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌కుమార్ రామమూర్తి తన పదవులకు కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఈ విషయాన్ని ఉద్యోగులకు జులై 10 న వెల్లడించారు.  కాగ్నిజెంట్ సంస్థలో రామ్ కుమార్ సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. సంస్థ ఉన్నతికి  రామ్ కుమార్  శాయశక్తులా కృషి చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-28T20:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising