ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం... త్వరలో...

ABN, First Publish Date - 2020-09-22T22:35:46+05:30

ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం ‘జీఎస్టీఆర్3బీ’ని త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు జీఎస్ట్ నెట్ వర్క్ ముఖ్యకార్యనిర్వాహకాధికారి ప్రకాశ్ కుమార్ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రీ-ఫీల్డ్ జీఎస్టీఆర్ 3బీని అందించేందుకు తాము కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ :  ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం ‘జీఎస్టీఆర్3బీ’ని త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు జీఎస్ట్ నెట్ వర్క్ ముఖ్యకార్యనిర్వాహకాధికారి ప్రకాశ్ కుమార్ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రీ-ఫీల్డ్ జీఎస్టీఆర్ 3బీని అందించేందుకు తాము కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.


జీఎస్టీఆర్3బీ ద్వారా పన్నులను సులభంగా చెల్లించవచ్చునని, గత సర్దుబాట్ల వంటి ప్రక్రియలకు సంబంధించి అవకాశముంటుందని, ఇదే క్రమంలో రానున్న రోజుల్లో మరికొన్ని మార్పులు కూడా జరుగుతాయని తెలిపారు.


జీఎస్టీఆర్ 1 లోని విక్రయాల వివరాల ఆధారంగా పన్నులు ఎంత చెల్లించాలనే వివరాలను ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడాన్ని జీఎస్టీఎన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా... ఈ వివరాలను జీఎస్టీఆర్ 3బీలో ఉపయోగించుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులు, సరఫరాదారులు ఇచ్చే వివరాల ఆధారంగా రసీదువారీగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్‌ను కూడా ఆటో జనరేట్ పద్ధతిలో జీఎస్టీఎన్ అందిస్తోంది.


కాగా... ఎడిట్ ఆప్షన్ కలిగి ఉండే ఈ ఫాంతో వ్యాపారులు పాత పన్ను బకాయిలను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. పీడీఎఫ్ రూపంలో ఉండే జీఎస్టీఆర్ 3 బీ ఫాంలో పన్ను చెల్లింపుదారులు పొందుపర్చాల్సిన ట్యాక్స్ లయబిలిటీ డేటాను అందిచే ప్రక్రియను జీఎస్టీఎన్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా... జీఎస్టీఆర్3బీ వల్ల పన్ను చెల్లింపు ప్రక్రియలు తమకు మరింత వెసులుబాటు కలిగిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-22T22:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising