ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలసీబజార్‌పై గూగుల్‌ ఆసక్తి

ABN, First Publish Date - 2020-08-09T08:46:00+05:30

భారత్‌లో అమెరికా టెక్నాలజీ దిగ్గజాల కొనుగోళ్ల వేట కొనసాగుతోంది. ఈ మధ్యనే జియో ప్లాట్‌ ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్‌.. తాజాగా మరో కంపెనీలో పెట్టుబడులు కొనుగోలు చేసే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.1,125 కోట్లతో10% వాటా కొనుగోలు!


న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా టెక్నాలజీ దిగ్గజాల కొనుగోళ్ల వేట కొనసాగుతోంది. ఈ మధ్యనే జియో ప్లాట్‌ ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్‌.. తాజాగా మరో కంపెనీలో పెట్టుబడులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌ బీమా సేవల ప్లాట్‌ఫామ్‌ పాలసీబజార్‌ డాట్‌ కామ్‌లో 10 శాతం వాటాను 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,125 కోట్లు)కు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌కు పాలసీబజార్‌లో 15 శాతం వాటా ఉంది. ఇందులో కొంత గూగుల్‌కు విక్రయించే అవకాశం ఉంది.


షేర్‌చాట్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు: దేశీయ సోష ల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ షేర్‌చాట్‌లో మైక్రోసాఫ్ట్‌ 10 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. గతంలో ట్విటర్‌ నుంచి 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సేకరించిన షేర్‌చాట్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ 65 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. భారత్‌లో నిషేధించిన టిక్‌ టాక్‌ యాప్‌నూ కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. 

Updated Date - 2020-08-09T08:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising