ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటిన్నర ఉద్యోగాలు గల్లంతు

ABN, First Publish Date - 2020-04-11T08:53:00+05:30

కోవిడ్‌-19 ధాటికి ఎగుమతి వాణిజ్య రంగం అతలాకుతలమైంది. సగానికి పైగా ఆర్డర్లు రద్దయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎ్‌ఫఐఈఓ, ఫియో) ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎన్‌పీఏలూ పెరుగుతాయ్‌.. 
  • ఎగుమతి రంగంపై ఫియో

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ధాటికి ఎగుమతి వాణిజ్య రంగం అతలాకుతలమైంది. సగానికి పైగా ఆర్డర్లు రద్దయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎ్‌ఫఐఈఓ, ఫియో) ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితిలోకి జారుకోవడంతో భారత ఎగుమతి రంగంలో 1.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఈ రంగ కంపెనీల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) కూడా పెరుగుతాయని అంటోంది.  తక్షణమే తమ రంగానికి ఊరట ప్యాకేజీ ప్రకటించాలని ఫియో ప్రెసిడెంట్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌ డిమాండ్‌ చేశారు. ఇంకా ఏమన్నారంటే..


  • జీవితం, జీవనోపాధికి మధ్య సమతూకం అవసరం. ఏదో ఒకదాన్నే ఎంచుకుంటే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
  • ప్రస్తుతం భారత ఎగుమతిదారుల చేతుల్లో కొద్దిపాటి ఆర్డర్లు మాత్రమే ఉన్నాయి. కనీస కార్మిక శక్తితో ప్లాం ట్లలో ఉత్పత్తికి అనుమతించకపోతే వారికి కోలుకోలేని నష్టం వాటిల్లనుంది.
  • ప్రస్తుత సంక్షోభంలో వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, హస్తకళాకృతులు, ఇంజనీరింగ్‌ రంగాల ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోనున్నారు. 
  • చైనాలోని ప్లాంట్లలో ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇదే అదునుగా మనకు రావాల్సిన ఆర్డర్లను చైనా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. 
  • ఎగుమతిదారులకు వడ్డీరహిత నిర్వహణ మూలధన రుణాలందించాలి. మార్చి నుంచి మే నెల వరకు ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐసీ నుంచి మినహాయింపు కల్పించాలి. ప్రీ, పోస్ట్‌ షిప్‌మెంట్‌ క్రెడిట్‌కు 90-180 రోజుల పొడిగింపు కల్పించాలి. 


దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వ్యాపారాలు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కొన్ని రంగాలు వెంటనే కోలుకునేందుకు అవకాశం ఉండగా.. మరికొన్నింటికి సమయం పట్టవచ్చని నిపుణులు అంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించిన రంగాలు లాక్‌డౌన్‌ ఎత్తివేశాక త్వరగా పుంజుకోవచ్చంటున్నారు. వినియోగదారుల కొనుగోలు శక్తి, ధోరణులపైౖ ఆధారపడిన రంగాలకు మాత్రం అధిక సమయం పట్టవచ్చని వారన్నారు.


లాక్‌డౌన్‌తో ఇంధన విక్రయాలు పదోవంతుకు పడిపోయి బంకుల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు భారంగా మారాయని నిర్వాహకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ కు ఆర్థికంగా ఊరట కల్పించాలని వారు కోరుతున్నారు. 


లాక్‌డౌన్‌ తర్వాత ఏ రంగం ఎలా? 

త్వరగా కోలుకునేవి..

ఫార్మా, వైద్య, ఆరోగ్య పరికరాలు, డిజిటల్‌ సేవలు, లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, గిడ్డంగులు, ఈ-కామర్స్‌, హోమ్‌ డెలివరీ సేవలు, 

సమయం పట్టేవి.. 

హోటళ్లు, పర్యాటకం

Updated Date - 2020-04-11T08:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising