ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాచ్‌తో చెల్లింపులు!

ABN, First Publish Date - 2020-09-17T06:10:23+05:30

ఎస్‌బీఐకి చెందిన యోనో యాప్‌తో అనుసంధానమై పని చేసే టైటాన్‌ పే వాచ్‌లు మార్కెట్లోకి ఉభయ సంస్థలు మార్కెట్లో విడుదల చేశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టైటాన్‌, ఎస్‌బీఐ భాగస్వామ్యంలో విడుదల


ముంబై: ఎస్‌బీఐకి చెందిన యోనో యాప్‌తో అనుసంధానమై పని చేసే టైటాన్‌ పే వాచ్‌లు మార్కెట్లోకి  ఉభయ సంస్థలు మార్కెట్లో విడుదల చేశాయి. ఇదే భారతదేశానికి చెందిన తొలి కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్‌ వాచ్‌.  ఈ వాచ్‌లు మార్కెట్లోకి తేవడానికి ఎస్‌బీఐ, టైటాన్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌, టైటాన్‌ కంపెనీ ఎండీ సీకే వెంకటరామన్‌ బుధవారం వర్చువల్‌గా ఈ వాచ్‌లు మార్కెట్లో విడుదల చేశారు. ఈ వాచ్‌ సహాయం తో ఎస్‌బీఐ కస్టమర్లు పిఓఎ్‌సల వద్ద డెబిట్‌ కార్డు స్వైప్‌ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చేతికి ఉన్న టైటాన్‌ వాచ్‌ని టాప్‌ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. దీంతో తమ కస్టమర్లు సరికొత్త షాపింగ్‌ అనుభూతి పొందగలుగుతారని, డిజిటల్‌ లావాదేవీలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అన్నారు.  


ఎలా పని చేస్తుంది? 

ఈ తరహా చెల్లింపుల సదుపాయం వినియోగించుకునేందుకు కస్టమర్లు ముందుగా యోనోలో రిజిస్టర్‌ కావాలి.


ఈ వాచ్‌ స్ర్టాప్‌లో అమర్చిన, టాపీ టెక్నాలజీస్‌ సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత సురక్షితమైన ఎన్‌ఎ్‌ఫసి చిప్‌ సహాయంతో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది.


రూ.2000 వరకు చెల్లింపులకు పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం సైతం ఉండదు. 


వాచ్‌ల ధర

వీటిని పురుషులకు మూడు, మహిళలకు రెండు వేరియెంట్స్‌లో అందుబాటులో ఉంచారు. రూ.2995 నుంచి రూ.5995 మధ్య శ్రేణిలో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2020-09-17T06:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising