ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌తో పాన్‌ జారీ

ABN, First Publish Date - 2020-05-29T06:16:28+05:30

ఆధార్‌ వివరాలు ఇచ్చిన వారికి అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పాన్‌ నంబర్‌ కేటాయించే సదుపాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం అధికారికంగా ప్రారంభించారు.ఫిబ్రవరి 12వ తేదీన ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించి ఇప్పటివరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆధార్‌ వివరాలు ఇచ్చిన వారికి అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పాన్‌ నంబర్‌ కేటాయించే సదుపాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం అధికారికంగా ప్రారంభించారు.ఫిబ్రవరి 12వ తేదీన ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించి ఇప్పటివరకు 6,77,680 పాన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో కేటాయించారు. ఆధార్‌ నంబర్‌, ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్‌ నంబర్‌ రెండూ ఉన్న వారికి ఆన్‌లైన్‌లో పాన్‌ కేటాయింపు వర్తిస్తుందని సీబీడీటీ పేర్కొంది. ఆసక్తి గల వారు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి అవసరమైన వివరాలు అందించిన 10 నిమిషాల్లోనే వారికి పాన్‌ నంబర్‌ వస్తుందని తెలిపింది. 


అందుబాటులోకి కొత్త ఐటీ ఫారం-26ఏఎస్‌:  సమగ్ర పన్నుల సమాచారం కోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ సవరించిన కొత్త ఫారం-26ఏఎ్‌సను అందుబాటులోకి తెచ్చింది. పన్నుఉ చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో జరిపే ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లు, షేర్‌ మార్కెట్‌  లావాదేవీలకు సంబంధించిన వివరాలు,  వాటికి సంబంధించి చె ల్లించే మూలంలో పన్ను కోత (టీడీఎస్‌), మూలం వద్దే పన్ను వసూలు వంటి వివరాలన్నీ ఈ ఫారంలో ఉంటాయి.


Updated Date - 2020-05-29T06:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising