ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవసరమైతే మరో ఉద్దీపన ప్యాకేజీ

ABN, First Publish Date - 2020-10-20T05:32:13+05:30

కొవిడ్‌తో నీరసించిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అవసరమైతే ఇంకో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రాసిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మలా సీతారామన్‌


న్యూఢిల్లీ: కొవిడ్‌తో నీరసించిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అవసరమైతే ఇంకో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రాసిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ మీద, జీడీపీ మీద కొవిడ్‌ ప్రభావాన్ని ప్రస్తుతం మదింపు చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రకటించిన రెండో ఉద్దీపనపైనా ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 9.5 శాతం నుంచి మైనస్‌ 10.3 శాతం వరకు పడిపోతుందని ఆర్‌బీఐ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి మరో ఉద్దీపన ప్యాకేజీపై సంకేతాలు ఇవ్వడం విశేషం. కాగా ఇదే సమావేశంలో పాల్గొన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రభుత్వం ఉత్పత్తి రంగంపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. ‘డిజిటల్‌ రంగం కంటే ఉత్పత్తి రంగం గురించి ఎక్కువగా ఆలోచించాలి. భవిష్యత్‌ పరిశ్రమలు, సేవలను అందించే సమగ్ర వ్యవస్థ గురించి ఆలోచించాలి’ అన్నారు. 

Updated Date - 2020-10-20T05:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising